ఎప్పటి లానే ఆరోజు మధ్యాహ్నం కూడా భోజనానికి మా ఆఫీసు కింది కాఫెటేరియా (హొటల్లాంటిది) కి వెళ్ళాను. మామూలు నీలం రంగు కుర్చీలు, అద్దంలా మెరిసే బల్లలు, రోజా పువ్వు పరిమళంతో శ్వాసించే కిటికీలు, అప్పుడప్పుడు అన్నం మధ్యలో కలుపుకోవడానికి కాస్త కమ్మగా అమ్మాయిల నవ్వులు, అన్నిటికంటే చెత్తగా భోజనాలు . మాకందరికీ అందుబాటులో ఉన్న ఒకే ఒక్క అమృతభాండం ఆ కాఫెటేరియా. ఆ అలుసుతో ఆ వంటవాడు వాడి మూడ్ కి తగినట్లు వంటలు చేస్తాడు. వాళ్ళావిడితో [...]
‘అవీ…ఇవీ’ అనే వర్గంలోని టపాలు
అవి నాకు రోజుకి 24 గంటలు సరిపోని మధురమైన రోజులు .! తను మౌనంగా,నెమ్మదిగా నా యవ్వనపు ప్రేమ కధకు అక్షరాలని అందిస్తున్నరోజులు .! ఉదయమో, ఆ సోగ కనుల చూపుకోసం తపించే ఆత్రమో నన్నునిదురలేపేవి. తనని, తన కింద పెదవి మాత్రమే వంపు తిరిగే సగం నవ్వుని తలుచుకోగానే నా ప్రాణం ఒణికేది. ఎంత కుదురుగా ఉన్న తన అందమైన మాయ నన్ను ఓ చోట నిలువనిచ్చేది కాదు. ఏదో లోకానికి అర్థం కాని గొప్ప అనుభూతి నాకు కలిగేది. ఖాళి కాఫీ కప్పుతో తో మాట్లాడేవాణ్ణి, నా 25cc హెర్కులస్ సైకిల్ తో నవ్వేవాన్ని, కాలేజీకి వెళ్ళే [...]
అప్పుడే నేను మోదటి సారి జీవితంలో..నిక్కరు వదిలి ప్యాంటు తొడిగాను.. అదీ మా నాన్న కి సరిపోక పోతె..దాన్ని సరి చేసి నాకు ఇచ్చాడు. ఓకటా రెండా.. ఓ పది.. మా నాన్న చిన్నప్పటివి కలిపి. మది లో ఎన్నో ఆలోచనలు eamcet లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలి..ఇంజనీరు అయిపోవాలి..నాలాగె నూనుగు మీసాలతో ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు ఒక మార్కుల మెషీను. ఎవరం ఎవ్వరితో మాట్ల్లాడుకోనె వారం కాదు .తీరిక అంతకన్నా లేదు [...]
కాఫీ అనగానే నాకు గుర్తొచ్చేది .. ఓ స్టీల్ గ్లాసు, అందులో ఫిల్టర్ కాఫీ, గ్లాసు అంచు వరకు పొంగి నిలిచిపోయిన రంగైన నురగ, సుడులుగా పైకి ఎగురుతూ కంటికి ఇంపుగా కనపడే.. ముక్కుకు ఘుమ్ముగా అంటుకొనే సువాసన..అంతటి ఆనందాన్ని తన నవ్వుతో కలిపి తీసుకొచ్చే అమ్మ..! పెదాలతో తియ్యగా చప్పరిస్తూ.. జ్హివకి నీల్లూరిస్తూ.. వేడి వేడిగా కాలుతుండే ఆ గ్లాసు అంచులని మాత్రమే జాగ్రత్తగా పట్టుకొని ఎండలో మెరుస్తున్న మెటుకుల మీద కూర్చొని ఊదుకుంటూ తాగడం. [...]
అదో సాయంత్రపు సన్న జాజి లాంటి బస్సు. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ హడావిడిలో కట్టేసి వెల్లిపోయినాట్లుగా ఉంది ఆ బస్సు స్టాండ్. విశాలమైన ప్రదేశం, పక్కగా షెల్టర్ ఉద్యోగం చేసే ఓ నాలుగైదు పేరు తెలియని ( నాకు తెలియని) పెద్ద చెట్లు. బస్సు ఇంక బయలుదేరడానికి సిద్దంగా ఉంది. కళాశాల లన్ని వదిలేసారు అనుకుంట… కలువలలాంటి అమ్మాయిలంతా ఆ బస్సులో భర్తీ అయిపోయారు. ఇంక సందేహం ఏముంది, కలువలు ఉంటె తుమ్మెద రెక్కల చప్పుడు ఉండద.. ? బస్సంతా యవ్వనపు గాలులతో ఊగిసలాడుతోంది..! చాల సంవత్సరాల [...]
ఇప్పుడె నీ ఫొటొ వంక చూస్తుంటె ఈ రొజంతటికి ఎంత ప్రయత్నించిన వెలగని నా మనసు నీ కళ్లని ఒక్క సారి చూడగానే ఎంతలా ఉప్పొంగిందొ తెలుసా. ఇంకా ఎందుకొ ఈ పిచ్చి మనసుకు నీ పై అంత ప్రాణం. నువ్వు ఏం చెస్తుంటావు నేను గుర్తొచ్చినప్పుడు, తప్పుకుంటావా? నెను అనేవాన్నే లేను అనుకుంటావ ? కాస్త ఐన ఆలొచించవా ? నా పై ఏ మాత్రం ప్రేమ పొంగదా ? నాతో మాట్లాడలనో నన్ను నీ [...]
జీవితం … ఆలోచిస్తే చాల వింతగా .. కొత్తగా అనిపించక మానదు . అందరిలానే .. ఏదో ఖాళీ సమయం దొరికినప్పుడో … ఇంటి డాబా మీద సూర్యాస్తమయాన్ని ఆస్వాదిం చేస్తూ .. చల్లని గాలి కి హృదయం స్పందిస్తూ … ఆలోచిస్తోంది కాదు .. జీవితం గురుంచి .. పువ్వు సున్నితత్వం నుండి జారి .. ముల్లు కి హృదయం గుచ్చుకొన్న .. బాధతో ఆలోచిస్తున్నా.. వదిలితే కింద మంటల్లో పడతాను .. అలానే ఉంటే [...]
చందమామ ..ప్రకృతి మనకు ఇచ్చిన వరం..చందమామ రావే ..జాబిల్లి రావే అని పాడే అమ్మలు.. కనబడటం లేదు. అసలు చందమామే కనపడకుండా కాంక్రిటు మిద్దెలు కట్టెస్తున్నాము. చల్లని వెన్నెల ల్లో ఇసుక తిన్నెల మధ్య ఎన్ని సమస్యలు న్నా మరచిపోవచ్చు. అసలు ఈ ఉరుకులు పరుగుల మధ్య తీరికేదీ..? ఉన్న పనులు ..సమస్యల్లొ…వీటిని చూసి ఇంకో సమస్య…tension. జీవితం చాలా సాదా..సీదాగా గడిచిపోతున్నట్టు లేదూ? మన పెద్ద వాళ్ళను చూసి నిజంగానే మనం చాలా కోల్పోయాము అని [...]