కాఫీ

Posted: ఆగష్టు 10, 2010 in అవీ...ఇవీ

కాఫీ అనగానే నాకు గుర్తొచ్చేది .. ఓ స్టీల్ గ్లాసు, అందులో ఫిల్టర్ కాఫీ, గ్లాసు అంచు వరకు పొంగి నిలిచిపోయిన రంగైన నురగ, సుడులుగా పైకి ఎగురుతూ కంటికి ఇంపుగా కనపడే.. ముక్కుకు ఘుమ్ముగా అంటుకొనే సువాసన..అంతటి ఆనందాన్ని తన నవ్వుతో కలిపి తీసుకొచ్చే అమ్మ..!

పెదాలతో తియ్యగా చప్పరిస్తూ.. జ్హివకి నీల్లూరిస్తూ.. వేడి వేడిగా కాలుతుండే ఆ గ్లాసు అంచులని మాత్రమే జాగ్రత్తగా పట్టుకొని ఎండలో మెరుస్తున్న మెటుకుల మీద కూర్చొని ఊదుకుంటూ తాగడం. అలా నా బాల్యనికంతటికి ఉదయాల్ని వెలిగించింది కాఫీ.

చలికాలం లో, మంచులో, నీరెండలో, సాయంత్రపు పువ్వుల చందం లో ఇలా అన్ని సమయాల్ని తన వెచ్చటి స్పర్శతో అందంగా మలిచేది కాఫీ.ప్రకృతినే కాదు, మనుషుల్ని మార్చగలదు.రెండు కప్పు కాఫీల్ని, ఓ అరగంట ఏకాంతాన్ని ఇద్దరి శత్రువులకి ఇచ్చి చూడండి.. నవ్వుతో ఒకరికొకరు నవ్వుకుంటూ తిరిగొస్తారు..!కాఫీ తాగుతున్నపుడు మనసు నవ్వులతో, తెలికయ్యే భారలతో విసాలమవుతుంది.

నాకు కాఫీ మరింత చేరువయ్యింది తన ప్రేమతో. ఎప్పుడైనా గొడవపడిన.. కాసేపు సరదాగా గడపాలన్న మా హృదయాలు కాఫీతో ఒక్కటయ్యేవి.కాఫీని, తన పెదవుల్ని కలిపి తాగి తనని ఉడికించేవాన్ని. ఇలా ఎన్నో అందమైన అనుభూతుల్ని మిగిల్చింది.

నా రాత్రి పని గంటల్లోకి అందమైన ప్రకృతిని కలుపుతుంది.. కాఫీ.నన్ను వెన్నలకిన్దికి, నగ్నంగా మెరిసే రోడ్లకి దారి తీయించి నా లోపలి మనిషిని నిద్రలేపుతుంది.జీవితాన్ని అందంగా చూపగలిగే ఆలోచనలకి, నా వికృత ఆలోచనలకి, నన్ను నేనే జోకర్ని చేసుకొని నవ్వుకొనే నిముషాలకి సాక్ష్యంగా నిలుస్తుంది.

ప్రకృతి మనిషికి వేల విధాలుగా తన ప్రేమను చూపుతుంది. విరిసే పువ్వులతో, చల్లగాలికి హాయిగా తల తిప్పి మనవైపు చూసే ఆకుపచ్చని ఆకులతో, చిరుజల్లులతో .. మనని పలకరిస్తుంది.మనిషి మనిషిపై ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి సృష్టించుకున్న ఓ వెచ్చని పది నిముషాలే కాఫీ.

హృదయాల్ని, కాఫీని కలిపి ఆస్వాదిస్తే లోకం కొత్తగా నవ్వుతుంది.

నా కోసం కమ్మని కాఫీ ఎదురుచూస్తోంది…  వస్తాను..!

–నగెష్ బాబు–

వ్యాఖ్యలు
  1. sUryuDu అంటున్నారు:

    Wow, good one, of course I too love filter coffee :)

  2. Sarath 'Kaalam' అంటున్నారు:

    చక్కటి, చిక్కటి కాఫీ సువాసనలు తగులుతూ వుండగ ఆ కాఫీ ఆస్వాదిస్తుంటే వచ్చే ఆనందమే వేరు. అందరికీ అంత చక్కగ కాఫీ చేయడం రాదు. ఎప్పుడో ఎంతో చక్కగా కాఫీ చేసిచ్చిన ఓ మిత్రురాలు అందుకే ఇంకా గుర్తుకువుంది.

  3. Sravanthi అంటున్నారు:

    Chala bagundi.Coffee antey istam leni vallu kuda,idi chadivina tharuvatha oka cup coffee ayna thagutharu.

  4. కొత్తపాళీ అంటున్నారు:

    WOW!
    ఒక కప్పు కాఫీ మీలో కవిని నిద్రలేపేసినట్టుంది!!

  5. nagseenu అంటున్నారు:

    suryudu గారికి , శరత్ గారికి, కొత్తపాళీ గారికి మా స్రవంతి కి, thanks for sharing your views

  6. కిషోర్ నాయుడు అంటున్నారు:

    మంచి కాఫీ లాంటే ……కవిత …మామ …

  7. suree అంటున్నారు:

    manchi coffe tagina santhosham

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )