అదో సాయంత్రపు సన్న జాజి లాంటి బస్సు…

Posted: ఆగష్టు 5, 2010 in అవీ...ఇవీ

అదో సాయంత్రపు సన్న జాజి లాంటి బస్సు. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ హడావిడిలో కట్టేసి వెల్లిపోయినాట్లుగా ఉంది ఆ బస్సు స్టాండ్.

విశాలమైన ప్రదేశం, పక్కగా  షెల్టర్ ఉద్యోగం చేసే ఓ నాలుగైదు పేరు  తెలియని ( నాకు తెలియని) పెద్ద చెట్లు.

బస్సు ఇంక బయలుదేరడానికి సిద్దంగా ఉంది. కళాశాల లన్ని వదిలేసారు అనుకుంట… కలువలలాంటి అమ్మాయిలంతా ఆ బస్సులో భర్తీ అయిపోయారు.

ఇంక సందేహం ఏముంది, కలువలు ఉంటె తుమ్మెద రెక్కల చప్పుడు ఉండద.. ? బస్సంతా యవ్వనపు గాలులతో ఊగిసలాడుతోంది..!

చాల సంవత్సరాల తరువాత అటువైపుగా మా దూరపు బందువు ఇంటికి వెళ్ళాల్సి రావడం వల్ల అక్కడ ప్రత్యక్షమయ్యాను.

నేను ఆ గాలిని పీల్చడానికి ఎక్కి నెమ్మదిగా చివరి కిటికీ దగ్గర కూర్చున్న.

సరిచేసుకొనే క్రాఫులు, మడతలు పడిపోయిన బస్సు పాసులు, ఖాలీ క్యారేజిలు చేసే వింత శబ్దాలు.. ఇంక పూర్తిగా యవ్వనం లోకి పండని పెంకి నవ్వులు.. ఇలా సరదాగా ఉంది అక్కడ ..!

విసిరే సూటి చూపులు అబ్బాయిలవితే కసురుకొనే లేదా కోసరితినే అమ్మాయిలు వాళ్ళు అయితే ఆ అందమైన సన్నివేశాన్ని హృదయం లో దాచుకొనే వాణ్ణి నేను అవుత…!

టీనెజ్ లో ఉన్న హయినంతా అనుభవిస్తున్నారు. తెలిసి తెలియని విషయాలు, తేలిగ్గా తీసుకొనే నిర్ణయాలు, వెంటపడే అందమైన కలలు.

దరువు శబ్దం చేస్తూ ఉన్న టాలెంట్ తో పది మందినైన పడగొట్టాలనే ఆశతో చిన్న ఏ. ఆర్. రెహ్మాన్ లు .. ఇంకా ఎన్నో..?!

నా మటుకు నేను అన్ని గమనిస్తూ.. కిటికీ వంక నుండి ఆకాశాన్ని చూసుకుంటూ నవ్వుకుంటున్న.

కొంత మందికి అదే మీటింగ్ స్పాట్. గడిచిపోయిన రోజునంత అలానే ఒప్పజప్పే స్నేహితులు కొందరు.. ఈ నిముషం ఎంతగా వారిని మిస్ అయ్యిందో చెప్పుకొనే యవ్వనపు జంటలు..

ఇన్ని చుట్టూ జరుగుతున్నా ఆ రోజు జరిగిన లెక్కల పరీక్షలో 16వ  ప్రశ్నకు రాసిన సమాధానం తప్పేమో అని ఆలోచించే వెర్రి వెంగలప్పలు ఉన్నారు.

ఇంతలో..

ఓ అమ్మాయి తను పరికిణి, ఓనిలతో తీయించుకున్న ఫోటోను అలా ఆ పాతపుస్తకం లోంచి చిన్నగా తీస్తూ.. పక్కనే నిలబడిఉన్న అబ్బాయికి ఇచ్చింది.  ఆ పుస్తకం లోంచి  ఏదో అద్బుతాన్ని చూస్తున్నట్లుగా మెరిసే

అతని వింత కళ్ళు. చేతికి పట్టిన చెమటని చొక్కాకు తుడుచుకొని జాగ్రత్తగా తీసుకొని, ఫోటో వంక ఆ అమ్మాయి వంక మార్చి మార్చి చూస్తున్నాడే తప్ప కంటి రెప్పైన వాల్చడెం..!

అంటే ఇది చూస్తున్న  నేనే రెప్ప వాల్చడం మర్చిపోయాను.. ఇక తను మాత్రం ఎం చెయ్యగలడు లే ?

అమ్మాయిల అరుదైన అస్త్రం ఆ వస్త్రం.. అదే పరికిణి ఓని.

అమ్మాయి ఎదుగుదలని మొదట అమ్మ గుర్తిస్తుంది..

ఓని ఆ అద్బుతాన్ని వాటి చేతి కింద దీపం లో కాపాడుతుంది..

అబ్బాయి మనసుని అంటీ అంటక వేడెక్కించి ప్రపంచ సౌందర్యాలకు  కళ్ళు తెరిపిస్తుంది..

ఏదో పురాతన అద్బుతాన్ని చూస్తున్నట్లుగా అతని కళ్ళు ఇంకా ఆ వెలుగుతోనే మెరుస్తున్నాయి.

సిగ్గును,నవ్వును చూపుల్లో కలిపి అతనికేస్తూ చూస్తూ.. ప్రతిస్పందిస్తోంది. ఈ అనుభవాన్ని వేల s.m.s లు, వందల మెయిల్స్ కూడా మోసుకురలేవు. అలాంటి మెరుపు విరుపులో ఉన్నాయ్ వారి హృదయాలు.!

నెమ్మదిగా బస్సు కదుల్తోంది.. పల్చని ఎండా వెలుగు ఆ బస్సులోకి నా గుండెలోకి దూరింది.

మిగిలిన బాగం త్వరలో మరొక పోస్ట్ చేయబడుతుంది.

నగేష్ బాబు

వ్యాఖ్యలు
  1. కొత్తపాళీ అంటున్నారు:

    Beautiful

  2. krishnapriya అంటున్నారు:

    మీ బస్ స్టాప్ వర్ణన.. సూపర్! టపా బాగుంది!

  3. nagseenu అంటున్నారు:

    కొత్త పాళీ గారికి, కృష్ణ ప్రియ గారికి chala thanks andi…

  4. bhanu అంటున్నారు:

    beautiful,

  5. హరే కృష్ణ అంటున్నారు:

    హ్మ్మ్!!
    నగేష్ బాబు గారు
    చాలా బాగా రాసారండీ

  6. Govardhan అంటున్నారు:

    Awesome post! believe it or not I read this post 7 times continuously……artham kaaka kadhu ;-) It is so natural, It reminded me the days of my Engg., college where I used to travel daily in RTC bus To and Fro for my college.

    Thanks for the post seenu…..Unknowingly, I am getting addicted for this blog…….not complainting good to read these cult classics :-)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )