జర భద్రం..కొడకొ..

Posted: ఆగష్టు 2, 2010 in చెంప పెట్టు...అన్ని సెటైర్లు ఒకేలా ఉండవు

ఢిల్లీలో..ఎ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసు కున్నా..హిందీ లోనె మాట్లాడు కుంటారంట.  ఆ విషయం ఏంటోకానీ..మనం మాత్రం.. తెలంగాణ..రాయలసీమ..ఆంధ్ర అని తెగ కొట్టేసుకుంటున్నామండి.అరవై యెళ్ళ బతుకు పోరులో మనం జీవించేది ఎన్నాళ్ళు.? నాకూ కావాలి.. మా చిత్తూరు ..ఒక దేశంగా మార్చేయాలండి. ఆయ్.. దానికి నెనే రాజునై పోవాలి.

జై  చిత్తూరు..జై జై చిత్తూరు

కాదు కాదు మా ఇల్లే ఒక దేశంగా మార్చేస్తే..? ఇంకా చెప్పాలి అంటె.. నేను నిలబడిన.. ఈ రెండు అడుగుల స్థలాన్ని నాకు ఒక దేశంగా ఇచ్చేస్తే. బాగుణ్ణండి..నేను నా దేశాన్ని అభివృద్ది పరచుకుంటానండి. నాలాగె ఎవరెవరు ఒక్క అడుగు రాష్ట్రం..అర అడుగు దేశం.. ఏది అడిగిన వాళ్ళకు అది ఇచ్చేయాలండి. నా దేశం నుండి (అదేనండి ఐతె చిత్తూరు లెకపోతె నా రెండు అడుగుల బుల్లి దేశం) full support వాళ్ళకు ఉంటుందండి.ఎదేదొ..చెసేద్దును.. ఎదేదో పీకెద్దును.. నా ఆత్మగౌరవం.. నా స్వపరిపాలనా(అంటె..?) …ఇంకా ఆ పదాలు ఎవో ఉన్నాయండి.. అవన్నీ నెనే చెసుకుందును.

నాకు బాగా తెలిసిన ఆయన ఒకరున్నారండి..పెద్దాయన…ఓ పెద్ద ముక్కున్నాయన.. పాపం..చాలా కష్టపడుతూ..రోజూ..సెలైన్..ఎక్కించుకుంటూ..నిరాహారదీక్ష(హు…దీన్ని..? కలికాలం అంటె ఏంటో అనుకున్నా) చేశాడు. ఇలా చేయొచ్చని మన పొట్టి శ్రీరాములు గారికి తెలీదు కాబొలు.. అనవసరంగా క ష్టపడి మన తెలుగు వాళ్ళకి ప్రాణాన్ని పణంగా పెట్టి త్యాగఫలంగా రాష్త్రాన్ని ఇచ్చారు.  త్యాగ ఫలాన్ని ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తే కానీ..తెలియ లేదు తన ప్రాంతం(కొంప దీసి దీన్ని దేశం అంటాడా ఎంటి..?)వెనకబడి ఉందని. కాసేపు ఆత్మగౌరవం అంటాడు…కాసేపు..వెనకబాటు తనం అంటాడు..కాసేపు స్వయం పరిపాలన అంటాడు.. మరి మనం ఎవరు..?(ఇతర దేశస్థులం కాబోలు..అంటె పాకిస్థాన్..అమెరికా వగైరా వగైరా అన్న మాట)

తెలుగు తల్లి అంటె ..తెలుగు మాట్లాడె వారికి తల్లి .. అని ఒక నమ్మకం..అంతె కాని..రాయలసీమ తల్లి..తెలంగాణ తల్లి అని వేరు వేరు కాదు .నాయనా.. ముక్కాయన.. రాజకీయాలు రుద్ది మాపై పండగ చేసుకున్నావు..ఏదో పది రూపాయలు (వందల కోట్లు..?) వెనకేసుకున్నావు. పోయేటప్పుడు ఎందుకన్నా..ముక్కన్నా..మమ్మల్ని వేరు చేసి చస్తావు.. మహా ఐతె ఓ పది సం. బ్రతుకుతావా? ప్రశాంతంగా దేవుని స్మరిస్తూ..శాంతిని (అమ్మాయి కాదు) పొందరాదె..

ఓ రాజకీయ ముక్కుద్యోగి గారు..sorry నిరుద్యోగి గారు..మీకు మంత్రి పదవి రాక పోతే తెలంగాణ..కేంద్ర మంత్రి పదవులు ఊడితె.. సెలైన్ దీక్ష చేస్తారని అనుకోలేదండి. (మంచి వాడికి పది రూపాయలు ఇచ్చి రాబట్టు కోవాలంటారు..చెడ్డవాడికి పది రూపాయలు ఇచ్చి దూరంగా వచ్చేయాలంటారు. ఆ పది మేము ఇచ్చే వాళ్ళం కదండీ..) ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు.. మొన్న ఎవడొ ఉప ఎన్నికల్లో ఓడిపోతె ఎవడో మొక్కు పేరు చెప్పి ప్రాణం తీసుకున్నాడు. దీనికి బాధ్యత ఎవరండి.?..ప్రశాంతంగా జీవిస్తున్న మా మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టింది ఎవరు..? మీరు కాదా? తెలంగాణ తరువాత ఆంధ్ర..రాయలసీమ ..ఎన్ని ముక్కలైనా ఫరవాలేదంట. అంటె మేము బాగుంటె చాలు మిగతా తెలుగు వారు ఎమైనా ఫరవాలేదన్న మాట.

ఓ మాజీ మంత్రి గారు.. ముక్కు పెట్టి ఆలోచిస్తే…క్షమించాలి.. మనసు పెట్టి ఆలోచిస్తె.. మీది మీకే స్వార్థం అని పించడం లేదూ.? ఎమైనా నేను తూర్పు తిరిగి దణ్ణం పెడుతున్నా..ఓ దేవుడా మనసున్న మంచి దేవుడా..ఏది మంచో..చెడో తెలియని కొంతమంది స్వార్థ జీవాలు(జీవులు కారు లెండి) స్వార్థ ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలని తుంగలో తొక్కి వాళ్ళని తప్పు దోవ పట్టిస్తున్నారు..స్వామి ఎమైనా నీదె భారం..!

శీను..

వ్యాఖ్యలు
  1. phani అంటున్నారు:

    pichi palu rakaalu..meedi andulo okati..

    • nagseenu అంటున్నారు:

      ధన్యవాదాలు ఫణి గారు(తెలంగాణ వాది అంటె బాగుంటుంది).. నాకు పిచ్చి అండి..తెలుగు అన్నా..తెలుగు వారన్నా..ముక్కలు చేస్తూంటె ఎమైనా చెయ్యాలని పించింది..ఎవరికోసమో మనం విడిపోవాలా..? దయ చేసి కళ్ళు తెరవండి.

  2. Veerraaju అంటున్నారు:

    బాగా చెప్పారు. ముక్కోడంటే ఆడే కదా , మొసలి పిల్లకు మొసళ్ళే పుట్టినట్టు ఆడి కొడుకు, కూతురు అందరికీ ఆ జోకర్ ముక్కులెట్లా వచ్చాయో. ఏదో లేండీ, మన తెలబాన్లందరికీ ఆడే ఏకైక నాయకుడు, పాపం. ప్చ్ .. తెలగాన వస్తే ఫాదర్ ఆఫ్ ద స్టేట్ ఆడే నట.

  3. Nutakki Raghavendra Rao అంటున్నారు:

    వాస్తవం చెప్పారు. మీరన్నట్లు “వాళ్ళని( యువతను) తప్పు దోవ పట్టిస్తున్నారు.”…….నూతక్కి

    • nagseenu అంటున్నారు:

      ఏమి చేస్తాం పరిస్టితి మన చేయి దాటి పోయింది ఇక్కడ.

  4. Govardhan అంటున్నారు:

    Seenu……Here we can’t blame a single guy…..

    Today the situation is been exploited by few / many crooked politicians…but the situation got vigorous only due to the people….

    Did u ever realised in our country ( means India , not chittoor or greamspet ha ha :-) majority mistakes / disasters are due to educated brains brother!!!

    I call them as Intellectual sythans……….

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )