నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..

Posted: ఆగష్టు 1, 2010 in కవితలు
ఏ నక్షత్రాలు మనసుపడి ఇచ్చాయి ఆ నవ్వుని నీకు…
మెరిసే సొగసైన పంటి వరుసతో..
నా ప్రాణాల్ని హాయిగా చెదరగొట్టే మాయతో..
వయసు బరువునంతా మోసే మెత్తటి పెదవులతో..   నువ్వు … నీ నవ్వు.. !

అసలు నీ నవ్వు ఒక్క అధరాల సొంతమా..?
అంత అందమూ వాటిదేనా..? కాదంటే  కాదు.!
చూపే పెదవులే అంత అందం తో తరిస్తుంటే..
సృష్టించే హృదయం ఇంకా ఎంత అద్బుతమై ఉంటుంది..!
దాన్ని మోసుకొచ్చే ఆలోచన, తన అదృష్టమనుకుంటుంది..!
నువ్వు నవ్వినప్పుడు..
ఏదో ఈ లోకానికి తెలియని.. నేను ఓపలేని.. అనుభూతిని కళ్ళతో నా మనసులోకి అదుముతావు..
నీ పెదవులే ప్రపంచమనుకునేల నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..
రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు..
ఇన్నీ అంత దూరం నుండే ఎలా చేస్తావు ..???
ముడుచుకుపోయినా ముద్దుగా ఉండే నీ చిన్ని గడ్డం.
ఎర్రని మెరుపులతో వెలిగే తీరిన బుగ్గలు.
ప్రాపంచిక అందాలన్నీ పూర్తయ్యేది నీ నవ్వుతో కలిపి చూస్తేనే కదా.. !
అన్ని దిక్కుల్లోను ఉదయించగలిగే  అద్బుతం నీ చిరునవ్వే కదా..!

అయినా

నీ పెద ఒంపు నా హృదయం లోకి ఓంపిన అనిర్జీవమైన సాగరంతో..
ఈ అక్షరాలని తడిపేదెంత..?  ఓ చినుకంత..!!!!

నగెష్ బాబు


వ్యాఖ్యలు
  1. Chocolate అంటున్నారు:

    Hi Nagesh…………
    Chalaaaaaa bagunnai……..superbbbbbbbbbb.

    oka movie tiyochu kada………….

    • kishore Naidu అంటున్నారు:

      mama bagundhi raaa…..

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )